తిరుమల వేంకటేశ్వర స్వామి సందర్శనలో మరింత పారదర్శకత కోసం టీటీడీ ఓ ప్రయోగాత్మక నిర్ణయం తీసుకుంది. అదే ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ సాయంతో స్వామి దర్శనానికి వచ్చే భక్తుల ముఖచిత్రాలను నమోదు చేయనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదం తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు ఇవాళ్టి నుంచి ముఖ గుర్తింపు సాంకేతికతను టీటీడీ అమలు చేయనుంది.
ఇందులో భాగంగా మంగళవారం తిరుమలలోని గదుల కేటాయింపు కేంద్రాల వద్ద ప్రయోగాత్మకంగా కెమెరాలతో ఈ సాంకేతికతను పరిశీలించారు. ఖాళీ చేసే సమయంలోనూ గదులు పొందినవారే వచ్చి మరోమారు ఫేస్ రికగ్నేషన్ చేయిస్తే కాషన్ డిపాజిట్ చెల్లిస్తారు. తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు కౌంటర్లు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఈ సాంకేతికత సాయంతో లడ్డూలు ఇస్తారు.