రోడ్డుపై హీరో నాగశౌర్య హల్​చల్.. అమ్మాయిని కొడతావా అంటూ యువకుడిపై ఫైర్

-

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఓ అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఓ యువకుడితో గొడవపడ్డాడు. అది కూడా ఆ అమ్మాయి బాయ్​ఫ్రెండ్​తో. అదేంటి.. ఒక హీరో అమ్మాయి కోసం గొడవపడటమేంటి అనుకుంటున్నారా..? అసలు సంగతేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.

టాలీవుడ్​ హీరో నాగశౌర్య నడిరోడ్డుపై ఓ యువకుడితో గొడవపడ్డాడు. రోడ్డుపై అమ్మాయిని ఎందుకు కొట్టావ్‌ అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యాడు. ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పాలంటూ సదరు కుర్రాడిని డిమాండ్ చేశాడు. ఇది ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు గానీ ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

‘ఈమె నా లవర్‌’ అంటూ యువకుడు చెబుతుంటే.. అయితే మాత్రం కొడతావా.. సారీ చెప్పు, రోడ్డుపై ఆమెను ఎందుకు కొట్టావ్‌? అని శౌర్య ప్రశ్నించిన దృశ్యాలు అందులో కనిపించాయి. అదే రహదారిపై ప్రయాణిస్తున్న పలువురు వాహనదారులు కూడా సారీ చెప్పాలంటూ ఆ యువకుణ్ని పట్టుబట్టారు. కొందరు నెటిజన్లు, అభిమానులు నాగశౌర్య చేసిన పనిని సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news