ఈ నెల 6 న చిలకలూరిపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారని మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభిస్తారని తెలిపారు రజినీ. గిరిజన ప్రాంతాల నుంచి విశాఖ పట్నం కేజీహెచ్‌కు నవజాత శిశువులను చికిత్సకు తీసుకువచ్చేటప్పుడు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు వైద్యాధికారులకు సూచించారు.

రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు పూర్తిగా అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే చింతూరు వంటి మారుమూల గిరిజన ప్రాంతానికి 40 ఏళ్లుగా డాక్టర్ లేని దుస్థితిని తప్పిస్తూ ఇప్పుడు స్పెషలిస్టు డాక్టర్‌ను నియమించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి రజిని గారు పేర్కొన్నారు.