ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలను కలిపే రోడ్డు రక్తసిక్తం అయింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత మినిలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలితీసుకుంది. మరో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కెల లోడుతో మినిలారీ బయలుదేరింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల వద్ద లోడు ఖాళీ చేయాల్సి ఉంది. ః
కానీ తూర్పుగోదావరి జిల్లాలోని అరిపాటి దిబ్బలు-చిన్నాయిగూడెం రోడ్డులోని దేవరపల్లి మండలం చిలకవారి పాకలు సమీపంలో అదుపు తప్పి పంటపొలాల్లోకి వాహనం దూసుకెళ్లి బోల్తా పడింది. ఆ సమయంలో వాహనంలో 9మంది సభ్యులుండగా.. డ్రైవర్ తప్పించుకొని పరారయ్యాడు. వాహనం పడిన సమయంలో జీడిపిక్కెల బస్తాల కింద చిక్కుకొని ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిలో ఒకరినీ ఘంటా మధు గా గుర్తించారు. డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరి, సుబ్రహ్మణ్యం ఘటన జరిగిన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.