అంతర్వేదిలో అగ్నిప్రమాదం : కాలిపోయిన రధం !

-

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం అంతర్వేదిలో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. ఆ ఊరిలో నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువు తీరాడు. దీన్ని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శిస్తూ ఉంటారు భక్తులు. అలాంటి స్వామివారి రథం అగ్నికి ఆహుతైంది. నిన్న అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

దాదాపు అరవై ఏళ్ళ క్రితం టేకుతో చేసిన ఈ రథాన్ని స్వామివారి కళ్యాణ ఉత్సవాలలో భాగంగా రథోత్సవంలో వినియోగించేవారు. అయితే ఆలయం ప్రాంగణంలోని రథం దగ్ధం కావడం స్థానికులతో పాటు భక్తులలో ఆందోళనకు నెలకొంది. అయితే ఈ రథం ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని దగ్ధమైందా.. లేక ఎవరైనా కావాలని తగులబెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాని కోసం నిర్మించిన షెడ్డులో ఉంచిన ఈ రథం దానంతట అదే ఎలా దగ్ధమైందన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news