గుంటూరులో మంకీపాక్స్ అనుమానిత కేసు

-

ఆంధ్రప్రదేశ్​లో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు గుంటూరులో నమోదైంది. ఒంటిపై దద్దుర్లతో ఉన్న 8 సంవత్సరాల బాలుడ్ని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్​లో చేర్పించారు. రెండు వారాలు గడిచినా నయం కాకపోవడంతో వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నమూనాలు తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు.


నివేదికను అనుసరించి తదుపరి కార్యాచరణ ఉంటుందని జీజీహెచ్ అధికారులు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు.. ఒడిశా నుంచి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం బాలుడ్ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మంకీపాక్స్ అనుమానిత కేసు రావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మహమ్మారి ప్రబలకుండా చర్యలకు ఉపక్రమించింది. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. కరోనా లాగా ఇది ప్రాణాంతక వ్యాధి కాదని.. కాస్త అప్రమత్తంగా ఉంటే సులభంగా నయమవుతుందని భరోసానిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news