విజయవాడలో టర్కీ కరెన్సీ కట్టల కలకలం

ఏపీ రాజధాని అమరావతి రోడ్లపై నోట్ల కట్టల కలకలం రేగి రెండు రోజులు కూడా కాక ముందే మరో కరెన్సీ గ్యాంగ్ వెలుగులోకి వచ్చింది. విజయవాడలో టర్కీ కరెన్సీ భారీ ఎత్తున పట్టుబడడం కలకలం రేపుతోంది. ఒక ముఠా దగ్గర భారీ ఎత్తున టర్కీ దేశానికి చెందిన కరెన్సీని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి మూడు కోట్ల విలువైన టర్కీ కరెన్సీని పోలీసులు సీజ్ చేశారు

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో టర్కీ కరెన్సీ ముఠాని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ముఠా వాడిన ఇన్నోవా, పల్సర్ బైక్ 5 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక రెండు రోజుల క్రితం అమరావతి సమీపంలోని వెంగళాయపాలెం వద్ద జాతీయ రహదారిపైనే 2 వేలు, 5 వందల నోట్ల కట్టలు రోడ్డు పక్కన పడేశారు. పోలీసులు ఆ నోట్లకట్టల్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ కరెన్సీ మొత్తం నకిలీదని పోలీసులు తేల్చారు.