సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు కోడుమూరు నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి. తెలుగుదేశం, బీజేపీల నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కీలక నేతలు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోచేరిన వారికి కండువాలు వేసి వైయస్సార్సీపీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి జగన్.

ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి చేరారు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ. ఆలూరు టీడీపీ నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైకుంఠం మల్లిఖార్జున చౌదరి, చిప్పగిరి మాజీ ఎంపీపీ భీమలింగప్ప చౌదరి, నియోజకవర్గ నేత షీలాధరణ్, వాల్మీకి సంఘం సీనియర్ నేత, మాజీ జెడ్పీటీసీ దేవేంద్రప్ప, వలిగొంద మాజీ ఎం పీపీ సిద్ధప్ప.