BREAKING : ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజులపాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మోస్తారు నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది.
శ్రీకాకుళం, VZM, అల్లూరి, ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతిబారి వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇక ఇటు అత్యవసర సేవలకు GHMC కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో GHMC, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, EVDM, కలెక్టర్ తదితర శాఖల అధికారులతో మాట్లాడిన మంత్రి తలసాని..ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.