ఏపీ ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 25 లక్షల వరకు ఆరోగ్య శ్రీ అమలు చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ముందుకు వచ్చింది. ఆరోగ్య శ్రీ అమలుపై పరిమితి పెంచిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. కోటిన్నర కుటుంబాలకు అభయం ఇవ్వనుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో రూ.లక్షలు ఖరీదైన వైద్యం పూర్తి ఉచితంగా అందించనుంది.
క్యాన్సర్ లాంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా ప్రభుత్వానిదే భారం భరించనుంది. నాడు 1,059 ప్రొసీజర్లతో అరకొరగా ఆరోగ్యశ్రీ అమలు చేశారు. కానీ నేడు 3,257 ప్రొసీజర్లతో బలోపేతం చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. చికిత్స అనంతరం కోలుకునే వేళ ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’తో ఆర్థిక తోడ్పాటు అందించనుంది. ఇందులో భాగంగానే నూతన మార్గదర్శకాలపై 18న వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.ఈ నెల 19 నుంచి కొత్త ఫీచర్లతో 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు.