దేశవ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా బంద్​తో అంధకారంలో శ్రీలంక

-

ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక తాజాగా విద్యుత్‌ సమస్యలో చిక్కుకుంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ దేశవ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో దేశమంతా గాడాంధకారంలోకి వెళ్లిపోయింది. ఈ మేరకు విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ప్రకటన విడుదల చేసింది. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు సీఈబీ అధికార ప్రతినిధి వెల్లడించారు. కాట్‌మలే-బియగమా మధ్య ప్రధాన విద్యుత్‌ లైనులో సమస్య ఏర్పడంతో సరఫరాకు అంతరాయం తలెత్తినట్లు సమాచారం. ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి గందరగోళంగా ఉంది. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి.

2022 నుంచి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ఇంధనం, ఆహార పదార్థాలు, ఔషధాలు ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. విదేశీ మారక నిల్వలు కూడా తక్కువ కావడంతో ఇంధన రవాణాకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి తలెత్తడంతో గత కొంతకాలంగా శ్రీలంకలో విద్యుత్‌ కోతలు సర్వసాధారణమయ్యాయి. రోజుకు దాదాపు 10 గంటల పాటు విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తుండగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విద్యుత్‌  సరఫరా నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news