బ్రేకింగ్‌ : టీడీపీ పాలిట్ బ్యూరోకు గల్లా అరుణ రాజీనామా

-

కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేసిన సీనియర్ నాయకురాలు గల్లా అరుణ కుమారి ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకు తెలుగుదేశంలో కీలకంగా భావించే పాలిట్ బ్యూరోలో కూడా సభ్యురాలిగా ఉన్నారు. అయితే తాజాగా ఆమె పాలిట్ బ్యూరోకు రాజీనామా చేశారు. నిన్న రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామాను గల్లా అరుణ పంపినట్టు చెబుతున్నారు.

గల్లా అరుణ కుమారుడు గల్లా జయదేవ్ ప్రస్తుతం తెలుగుదేశం ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ప్రస్తుతానికి టీడీపీలోనే ఉంటారని కేవలం పాలిట్ బ్యూరో నుండి మాత్రమే తప్పుకున్నారని అంటున్నారు.తన వ్యక్తిగత కారణాల వల్లే పొలిట్ బ్యూరోను వీడుతున్నట్లు ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపిన లేఖలో పేర్కొన్నారు. గల్లా జయదేవ్‌ రెండు మార్లు గుంటూరు నుంచి ఎంపీగా గెలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news