తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం జగన్. నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుసుకోవాలనినియోజకవర్గంలోని కార్యకర్తలను కలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
రానున్న ఎన్నికలకు ఇప్పటినుంచి సిద్ధం కావాలని సీఎం జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు. మూడేళ్లలో మనం చేసిన మంచి కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లాలని అన్నారు. ఒక్క ఆలూరు లోనే పలు పథకాల ద్వారా మూడేళ్లలో నగదు బదిలీ ద్వారా రూ. 1050 కోట్లను అకౌంట్లలో జమ చేశామని వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్న మనం గ్రామస్థాయిలో కూడా వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన మేలును వివరిస్తున్నామన్నారు.