ఆ పని చేస్తేనే భర్తలకు అన్నం పెట్టండి.. మహిళలకు చంద్రబాబు కీలక సూచన

-

ఆంధ్రప్రదేశ్ మహిళలకు టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు కీలక సూచన చేశారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో సోమవారం బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భవన్ లో మహిళలతో బాబు ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం వస్తే చాలు రీఛార్జ్ అవుతానని.. మరోసారి ఇక్కడ తన గెలుపును రెన్యూవల్ చేయాలని కోరుతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నాసిరకం మద్యం అమ్ముతూ.. ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచేస్తున్నారని జగన్ సర్కార్పై ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో రూ.60 మద్యం ధర రూ.200 అయ్యిందని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టండని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. జే బ్రాండ్ ఎందుకు పెట్టారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కుప్పంలో రాళ్లు, మట్టిని కూడా అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది కౌరవ సభ అని.. దాన్ని గౌరవ సభ చేశాకే మళ్లీ అక్కడ అడుగుపెడతానన్నారు. అందుకోసం మీరంతా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేయాలన్నారు. ఏపీలో వైసీపీ పాలన అంతం కావాలంటే లక్ష మెజార్టీతో కుప్పంలో టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news