పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ రిలీఫ్.. స్థానిక ఎన్నికల్లో జనసేనకు ‘గాజు గ్లాసు’ గుర్తు

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ రిలీఫ్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర స్థానిక ఎన్నికల్లో జనసేనకు ‘గాజు గ్లాసు’ గుర్తు వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు 19 రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది.

వైసిపి, టిడిపి మాత్రమే రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలని తెలిపింది. అలాగే ఐదు జాతీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్న 11 పార్టీలకు గుర్తులను కేటాయించింది. జనసేనకు రిజర్వుడ్ సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే ఉంచుతూ… గాజు గ్లాసు గుర్తును కొనసాగించింది.

ఇది ఇలా ఉండగా, పిఠాపురంలో నాపై పోటీ చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్‌‌ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్ విసిరారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. ‘మీ అభిమానుల చేత బండబూతులతో మెసేజ్ లు పెట్టిస్తున్నారు. గోచి, మొలతాడు లేని వారితో తిట్టించడం మగతనం కాదు. మీరు సినిమాల్లో హీరో తప్ప రాజకీయాల్లో హీరో కాదన్నది గ్రహించండన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news