ఏపీ రేషన్‌ కార్డు దారులకు శుభవార్త..ఇకపై 2 కేజీల కంది పప్పు !

ఏపీ రేషన్‌ కార్డు దారులకు శుభవార్త. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరాఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో దాన్యం సేకరణ నుంచి రేషన్ పంపిణీ వరకు అన్నింటినీ పరిశీలించేందుకు విజయవాడలోని పౌరసరాఫరాల సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాన్ కంట్రోల్ కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు.

‘రేషన్ కార్డుదారులు కోరితే నెలకు ఒక్కో కుటుంబానికి రెండు కిలోల చొప్పున కందిపప్పు ఇచ్చేందుకు సిద్ధమే. అయితే ప్రస్తుతం కిలో చొప్పున ఇస్తున్న కందిపప్పుని వారు తీసుకోవడం లేదు’ అని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘రెండు వారాల్లో చిరుధాన్యాల పంపిణీ మొదలు పెడతాం. గోధుమపిండి పంపిణీని రాష్ట్రమంతటా విస్తరిస్తాం. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి దాన్యం లోడింగ్, రవాణా, మిల్లుల్లో మర ఆడించే గోదాములకు పంపడం సహా అన్ని సీసీ కెమెరాలు ద్వారా ప్రతి నిమిషం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాం. ఎండియు వాహనాలు ఎక్కడున్నాయి? ఇంటింటికి వెళ్తున్నాయో లేదో కూడా తెలిసేలా ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?