ఏపీలో రేషన్‌కార్డులు ఉన్న వారికి శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. జూన్ నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి చిరు ధాన్యాలు పంపిణీ చేస్తామని పౌరసరాఫరాల శాఖ తెలిపింది. నంద్యాల జిల్లాలో ఇప్పటికే జొన్నలు సరాఫరా చేస్తు వస్తోంది.
అయితే.. జూన్ నుంచి కర్నూలు, సత్యసాయి, అనంతపురం జిల్లాలో రాగులు పంపిణీ చేస్తారు. 3కేజీల బియ్యం బదులు ఉచితంగా రాగులు పొందవచ్చని… జూలై నుంచి రాయలసీమలోని ఇతర జిల్లాల్లో కూడా చిరుధాన్యాలు పంపిణీ చేస్తామని వెల్లడించింది. కాగా, సీఎం జగన్ గుంటూరు పర్యటన ఖరారైంది. జూన్ 2న గుంటూరులో పర్యటించనున్న సీఎం… వైయస్సార్ యంత్ర సేవా పథకం రెండో మెగామేళా నిర్వహణలో పాల్గొన్నారు. ఈ మేళాలో భాగంగా 793 ట్రాక్టర్లు, 38 హార్వెస్టర్లను రైతులకు అందించనున్నారు. ఈ వేదిక ద్వారా గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తారు.