సీఎం జగన్ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం ఇవాళ జరిగింది. క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరుగగా.. పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఎస్‌ఐపీబీ. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్ భారతి కో–ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) ఆధ్వర్యంలో రెండు విడతల్లో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు, రూ.560 కోట్లతో 250 కె.ఎల్.డి. సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
100 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న క్రిబ్‌కో, 400 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా ఆమోదం తెలిపింది ఎస్‌ఐపీబీ. ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2022–27లో మరిన్ని చర్యలు చేపట్టనున్నారు. ఇప్పుడున్న ఎగుమతులను 5 ఏళ్లలో రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో రూ.3.5 లక్షల కోట్లు ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంట్లో భాగంగా పలు నిర్ణయాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలపగా.. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ పాలసీ 2022–2027లో భాగంగా మరిన్ని ప్రోత్సాహకాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.