పసుపు, కుంకుమలు కింద పడితే ఏమౌతుందో తెలుసా?

పసుపు, కుంకుమలను శుభకార్యాలలో వాడతారు..వాటిని శుభ ప్రదంగా భావిస్తారు.సుమంగళీకి గుర్తులైన ఈ రెండింటిని తెలుగు సాంప్రదాయాలలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటికి అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా కుడా పసుపు,కుంకుమలను పెట్టి పంపిస్తారు..ఎంతో పవిత్రంగా కూడా పసుపు, కుంకుమలను చూస్తారు.ఏదైనా శుభకార్యానికి ఆహ్వానించినప్పుడు కూడా బొట్టుపెట్టి పిలుస్తారు. పుట్టింటికి వెళ్లిన ఆడపిల్లలు అత్తారింటికి వెళ్లేటప్పుడు పసుపు-కుంకుమ అందించి పంపిస్తుంటారు.

ఇలా ఎంతో పవిత్రంగా భావించే పసుపు, కుంకుమ ఒక్కోసారి పొరపాటున చేజారిపడిపోతుంది. అలాంటప్పుడు చాలామందిలో భయం మొదలవుతుంది. అదో అపశకునం అని, ఏదో చెడు జరగబోతోందని భావిస్తారు.అయితే శాస్త్రీయ పరంగా అలాంటివి లేదని పెద్దలు అంటున్నారు.అది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు జోతిష్యపండితులు.

ఒకవేళ కింద పడితే ఏం చేయాలో ఇప్పుడు చుద్దాము..

ఒకవేళ కుంకుమ చేజారి కింద పడితే అలా పడినచోట భూదేవికి బొట్టుపెట్టి మిగతా కుంకుమను చెట్లలో వేయాలి.మంగళ, శుక్రవారాల్లో కుంకుమ కిందపడిందంటే చాలా ఫీలైపోతారు. కానీ అస్సలు బాధపడాల్సిన అవసరం లేదంటున్న పండితులు..ఆ రోజు ఇంటికి వచ్చిన ముత్తైదువుకు బొట్టుపెట్టి పంపించాలని చెబుతున్నారు.ఏదైనా పూజ, వ్రతం చేస్తున్నప్పుడు కుంకుమ, పసుపు చేజారి పడినా అతి ఎంతమాత్రం అపశకునం కాదు.కింద పడితే ఎటువంటి అశుభం కాదట చింతించకండి..