మూడు రాజధానుల కోసం వైసీపీ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో భారీ ర్యాలీ తీయాలని నిర్ణయించింది. అక్టోబర్ 15న వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో ర్యాలీ చేయాలని జేఏసీ, అలాగే వైసీపీ పార్టీ నిర్ణయం తీసుకుంది.
వికేంద్రీకరణకు మద్దతుగా ఇవాళ విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యార్థి సంఘాల నేతలు, వివిధ ప్రజాసంఘాలు, వైసీపీ పార్టీ నేతలు హాజరయ్యారు. మూడు రాజధానులకు మద్దతుగా ఈ సందర్భంగా జేఏసీ ఏర్పాటు చేసి… విశాఖలో భారీ ర్యాలీ తీయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు.
అక్టోబర్ 15న వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో ర్యాలీ చేయాలని జేఏసీ నిర్ణయం. #3CapitalsForAP pic.twitter.com/jnWMr98hJC
— YSR Congress Party (@YSRCParty) October 8, 2022