అసదుద్దీన్‌తో కేసీఆర్ స్కెచ్.. ఏపీలో కూడా..?

-

టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్..ఇకపై జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నారు. బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా బలపర్చడమే లక్ష్యంగా పనిచేయనున్నారు. ఈ క్రమంలో తమతో కలిసొచ్చిన పార్టీలతో కేసీఆర్ కలిసి పనిచేయనున్నారు. ఇప్పటికే కొన్ని పార్టీలు కేసీఆర్‌కు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు సైతం కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లోకి స్వాగతం పలికాయి. అటు కర్ణాటకకు చెందిన జే‌డి‌ఎస్ సైతం మద్ధతు తెలిపింది. మొదట నుంచి మాజీ సీఎం కుమారస్వామి..కేసీఆర్‌కు సపోర్ట్‌గా ఉంటూ వస్తున్నారు.

అలాగే కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జే‌డి‌ఎస్‌కు బి‌ఆర్‌ఎస్ మద్ధతు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో బి‌ఆర్‌ఎస్ పోటీ చేయొచ్చని అన్నారు. అయితే కేసీఆర్ టార్గెట్ మొత్తం పార్లమెంట్ ఎన్నికలపైనే ఉంది. ఇప్పటికిప్పుడు ఇతర రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాణించడం కష్టం. పైగా నేషనల్ పాలిటిక్స్‌లో కీలకంగా ఉండాలంటే పార్లమెంట్ స్థానాల్లోనే బరిలోకి దిగాలి.

ఇతర రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో కలిసి బి‌ఆర్‌ఎస్ బరిలోకి దిగనుంది. ఇదిలా ఉంటే తమ మిత్రుడైన ఎం‌ఐ‌ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో కలిసి కేసీఆర్..జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఎం‌ఐ‌ఎం ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తూ వస్తుంది. కొన్ని చోట్ల సక్సెస్ అయితే..కొన్ని చోట్ల ఫెయిల్ అవుతుంది. ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్న చోటే ఎం‌ఐ‌ఎం పోటీకి దిగుతుంది.

ఇదే క్రమంలో ఎం‌ఐ‌ఎంతో కలిసి ముస్లిం, ఎస్సీ, ఎస్టీ ఓట్లు టార్గెట్‌గా కేసీఆర్ కొత్త స్కెచ్ వేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఏపీలో కూడా అదే టార్గెట్‌తో బరిలో దిగుతారని తెలుస్తోంది. కాకపోతే ఏపీలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఓటర్లు వైసీపీ వైపు ఉన్నారు. ఇప్పుడు అక్కడ అసదుద్దీన్‌తో కలిసి కేసీఆర్ రాజకీయం చేస్తే..జగన్‌కే నష్టం జరుగుతుంది. అయితే కేసీఆర్-అసదుద్దీన్‌లకు జగన్ సన్నిహితుడే. మరి ఏపీలో వీరి రాజకీయం ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news