బెంజ్ కారు తీసుకొని ఉంటే కార్తిక్ పేరు ఎందుకు తొలగించలేదు ?

-

ఆలూరులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జయరాం మీడియాతో మాట్లాడారు. అయ్యన్నపాత్రుడుకు మతిభ్రమించిదన్న ఆయన బుద్ధా వెంకన్నకు బుద్ధిలేదని అన్నారు. ట్విట్టర్ లోకేష్ అడ్డుదారిలో రాజకీయాలు చేసున్నాడని, ఆయన ప్రత్యక్ష రాజకీయాలు చేయలేని వ్యక్తని అన్నారు. కార్మిక శాఖలో మందుల బిల్లు రావాలని ఏజెన్సీ అడిగితే నేను విచారణకు అదేశించానని ఆయన అన్నారు. విచారణలో గత ప్రభుత్వం లో పనిచేసిన అచ్చెన్నాయుడు అవినీతి పాలుపడ్డాని విచారణ తేలిందని, 2014, 2018 సంవత్సరంలో అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడుని అరెస్టు చేశారని అన్నారు.

బెంజ్ కారు తెలకపల్లి కార్తిక్ 2019 డిసెంబర్ లో కొనుగోలు చేసాడని, కారు ఈఎంఐలు కట్టలేదని ఆ కారును ఫైనాన్స్ వారు సీజ్ చేశారని అన్నారు. 2020 జూన్ లో ఈఎస్ఐ స్కాం క్రింద కేసు నమోదు అయిందని కారు తీసుకొని ఉంటే A14 ముద్దాయిగా ఉన్న కార్తిక్ పేరుని ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. టీడీపీ నాయకులుకి పదవులు లేక మతిభ్రమించిందని ఆయన అన్నారు. భూమి కొనుగోలులో అన్ని పేపర్లు కరెక్టుగా ఉన్నందుకే ఆ భూమిని కొన్నానని ఎక్కడా భూకబ్జాకి పాల్పడ లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news