Hari Ramajogaiah: కూటమి మేనిఫెస్టోపై మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య లేఖ రాశారు. ఆ వర్గాలను చిన్న చూపు చూశారంటూ ఫైర్ అయ్యారు హరి రామజోగయ్య. వై.సి.పి, టిడిపి జనసేన బిజెపి కూటమి మేనిఫెస్టోల పై మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య లేఖ రాశారు.
కాపు, బలిజ, ఒంటరి కులస్తులకు జనాభా ప్రాతిపదికన ఐదు శాతం కానీ విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్స్ అంశం లేకపోవడం దారుణమని ఆగ్రహించారు మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య. తమ పార్టీల మేనిఫెస్టో ప్రకటనలో కాపుల రిజర్వేషన్ అంశం లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు.
వెనుకబడియున్న కాపుల పట్ల ఈ పార్టీలు చిన్న చూపు చూడటం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య. కాగా ఇటీవలే వైసీపీ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అటు నిన్న కూటమి పార్టీలు మేనిఫెస్టోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.