ఆ నిర్మాణాలను కూల్చేస్తాం..జగన్‌ సర్కార్‌ కు హై కోర్టు వార్నింగ్‌ !

-

ఏపీ సీఎం జగన్‌ కు ఊహించని షాక్‌ ఇచ్చింది ఏపీ హై కోర్టు. తాజాగా విశాఖ రుషికొండ దగ్గర నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నిర్మాణాలకు అనుమతులు లేవని తేలితే కూల్చివేతకు ఆదేశిస్తామని కోర్టు చెప్పింది. వ్యక్తిగత కారణంతో ప్రత్యేక ప్రభుత్వ లాయర్ విచారణకు హాజరు కాలేదని, విచారణను వాయిదా వేయాలని ఏజి ఎస్. శ్రీరామ్ కోరారు.

- Advertisement -

అనుమతులు లేకుండా కడుతున్నారని, సాధ్యమైనంత త్వరగా విచారణ జరపాలని పిటీషనర్ మూర్తి తరఫు లాయర్ కోరారు. అనుమతులు లేకుండా నిర్మించిన, గతంలో తాము ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా పనులు జరిగిన కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది. విశాఖలోని రుషికొండ టూరిజం రిసార్ట్ పేరుతో తవ్వేస్తూ, పరిధికి మించి నిర్మిస్తున్నారని విశాఖ తూర్పు టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్ పివిఎల్ఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో వేరువేరుగా పిల్ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...