ప్రకాశం జిల్లాలో హిజాబ్ కలకలం… హిజాబ్ తీసేసి స్కూల్ కు రావాలని అనడంతో వివాదం

-

కర్ణాటకలో ‘ హిజాబ్’ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అక్కడ రోజురోజు ఏదో ఓ చోట వివాదం నడుస్తూనే ఉంది. ఈ అంశం దేశ వ్యాప్తంగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. హిజాబ్ ధరించి విద్యార్థినిలు తరగతులకు హాజరవ్వడాన్ని మరో వర్గం విద్యార్థులు తప్పుబడుతూ.. కాషాయ కండువాలతో రావడం ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో ఈ కేసు కర్ణాటక హైకోర్ట్ ముందు ఉంది. ప్రస్తుతం ఈ వివాదంపై కర్ణాటక హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులను కూడా జారీచేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇతర రాష్ట్రాల్లో కూడా హిజాబ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల విజయవాడలోని లయోలా కాలేజీలో హిజాబ్ వివాదం నడిచిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంలో ఉద్రిక్తత నెలకొంది. హిజాబ్ తీసేసి స్కూల్ కు రావాలని ప్రిన్సిపాల్ కోటిరెడ్డి ముస్లిం విద్యార్థులను కోరారు. ఈ విషయాన్ని విద్యార్థినిలు ముస్లిం మతపెద్దల వద్దకు తీసుకెళ్లారు. దీంతో స్కూల్ ముందు ముస్లిం విద్యార్థినులు, మతపెద్దలు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ కోటిరెడ్డికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news