బీజేపీ నాయకుడి కాలుపైకి కారు ఎక్కించిన హోం మంత్రి అనిత ?

-

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితకు ఊహించిన షాక్‌ తగిలింది. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కాన్వాయ్‌లో అపశృతి జరిగింది. తిరుమల దర్శనార్థం హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత తిరుమల వెళుతుండగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. హోం మినిస్టర్ వంగలపూడి అనిత కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదవశాత్తు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కాలు పైకి ఎక్కింది.

Home Minister Anitha’s convoy was in disarray

ఈ ప్రమాదంలో ప్రభాకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ప్రభాకర్‌ను స్థానిక పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వాస్తవానికి ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కు శాలువ కప్పడానికి వచ్చారు బిజెపి నాయకుడు ప్రభాకర్ నాయుడు. ఈ తరుణంలోనే..కాన్వాయ్ వెంబడి వచ్చిన ఓ వెహికల్ దూసుకు రావడంతో బిజెపి నాయకుడు ప్రభాకర్ నాయుడు ఎడమ కాలు ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం బిజెపి నాయకుడు ప్రభాకర్ నాయుడు… రూయా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news