పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఉంది – ఏపీలో రేప్ లపై హోంమంత్రి వనిత సంచలన వ్యాఖ్యలు

-

ఏపీలో వరుసగా జరుగతున్న ఘటనలపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవం.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో అత్యాచారం చేయడానికి ముగ్గురు రాలేదు.. ముగ్గురు బాగా మద్యం సేవించి ఉన్నారని వెల్లడించారు. డబ్బుల‌ కోసం మొదట భర్తపై దాడి చేసారు.. భర్తపై దాడి చేస్తుంటే భార్య అడ్డుకునే ప్రయత్నం చేసిందని చెప్పారు.

దీంతో మహిళను పక్కకు లాక్కునివెళ్ళి అత్యాచారం చేశారని.. గంజాయి వల్ల నేరాలు జరుగుతున్నాయని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని వెల్లడించారు. గత డిజిపి గంజాయిని ఎలా ధ్వంసం చేశారో అందరికీ తెలుసు అని.. గంజాయి సాగు చేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపిస్తున్నామన్నారు.

రైల్వేస్టేషన్ లో భద్రతను పెంచటంతో పాటు సీసీ కెమేరాలు ఏర్పాటు చెయ్యటానికి చర్యలు తీసుకుంటున్నాం.. గడప గడపకు కార్యక్రమం పోస్టు పోన్ చచెయ్యడంలో రాజకీయ కోణం లేదని చెప్పారు. ప్రతి ఇంటికి సగటున 5 పథకాలు అందుతున్నాయి.. ఏ ఇంటికి ఏ పథకాలు అందుతున్నాయో వాటికి సంబంధించిన డేటా తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు. ఆ సమాచారం తీసుకున్న తర్వాత గడప గడపకి ప్రోగ్రాం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు వనిత.

Read more RELATED
Recommended to you

Latest news