హాట్ టాపిక్: కొత్త “అధ్యక్షా” ఎవరు… ఈయనకే ఛాన్స్ ఎక్కువ!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కొత్త స్పీకర్ ఎవరు అనే చర్చ రోజు రోజుకీ పెరిగిపోతుంది. అదేంటి… స్పీకర్ తమ్మినేని సీతారం ఉన్నారుగా! కరక్టే కానీ… ఆయన అమాత్యా అని పిలిపించుకోవాలని తీవ్ర ప్రయ్యత్నాలు చేస్తున్నారు. అవును… ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు సడన్ గా మంత్రి అయిపోవాలని అనిపించిందంట. ఎన్నికలకు ముందు జగన్ ఈయనకు ఇచ్చిన హామీ ఏమిటన్న విషయం కాసేపు పక్కన పెడితే… దీనికి ఆయనకున్న రెండు అర్హతలు ఉన్నాయని భావిస్తున్నారంట.


వీలైనంత తొందర్లో ఏపీ కేబినెట్ విస్తరణ ఉండొచ్చన్న కథనాల నడుమ… ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇక తనకు మాత్రం ఏమి తక్కువ అనుకున్నారో ఏమో కానీ… స్పీకర్ తమ్మినేని సీతారం కూడా రంగంలోకి దిగారంట. ఇదే క్రమంలో ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా వ్యక్తపరిచారు కూడా. దీంతో అమాత్య పదవి కోసం ఆయన తనవంతు ప్రయత్నం తాను చేస్తున్నారని అంటున్నారు! ఈ క్రమంలో ఆయనకున్న రెండు అర్హతల్లో… ఒకటి బీసీ సామాజికవర్గం కాగా… రెండోది సీనియారిటి!!

ఆ ప్రయత్నాల కష్టం ఫలించి… “ఇప్పటికే పలుమార్లు మంత్రిగా పనిచేసినా కూడా… ఈ డెబ్బయ్యేళ్ళ వయసులో ఉన్న ఈ పెద్దాయన తన జీవిత చరమాంకంలో మంత్రిగా పనిచేసి.. రాజకీయాలలో రిటైర్ కావాలని అనుకుంటున్నట్లున్నారు” అని జగన్ భావించి మంత్రి పదవి కట్టబెడితే… ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ “నెక్స్ట్ స్పీకర్ ఎవరు” అనే ప్రశ్న!

అయితే ఈ విషయంలో జగన్ ఆలోచన మొత్తం… కోన రఘుపతివైపే ఉండొచ్చని అంటున్నారు! రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు.. నాలుగు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీకి స్పీకర్ గా పనిచేశారు. ఆయన చాలా సీనియర్ నేతగా ఉండేవారు. ఇదే క్రమంలో కోన రఘుపతికి ఆ పదవి ఇవ్వడం ద్వారా స్పీకర్ పదవి వివాదం కాకుండా ఉంటుందని.. పైగా సభాపతి నియమాలు, మర్యాదా కాపాడుతారని అంటున్నారు!! అదేవిధంగా… ఈ నిర్ణయం ద్వారా బ్రాహ్మణ సామాజికవర్గానికి అతి కీలకమైన పదవితో న్యాయం చేసినట్లు కూడా అవుతుందని జగన్ భావిస్తున్నారంట! ఇవన్నీ ఓకే అయ్యి… సీతారాం మంత్రి అయితే మాత్రం… కోన రఘుపతే కాబోయే స్పీకర్.. కన్ ఫాం… అంటున్నాయి వైసీపీ వర్గాలు!