అదనపు కట్నం కావాలంటూ వేధింపులు.. వివాహిత మృతి!

ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైనా కొన్నాళ్లకే భర్తతో పాటు అత్తామామలు, తోటి కోడళ్లు తమ విశ్వరూపాన్ని చూపించారు. కట్నం సరిపోలేదు.. మీ పుట్టింటికి వెళ్లి ఇంకా డబ్బులు తీసుకుని రమ్మని హింసించసాగారు. షాద్ నగర్ రూరల్ లోని ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని దూసకల్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది.

crime
crime

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ చెందిన బొమ్మగల్ల రాములు కూతురు శ్రీజ (20)కు గతేడాది ఫరూఖ్ నగర్ మండలం దూసకల్ గ్రామానికి చెందిన కల్లెపల్లి శ్రీనివాస్ తో వివాహం జరిగింది. పెళ్లి కానుకగా శ్రీజ తల్లిదండ్రులు రూ.2 లక్షలు, 8తులాల బంగారం అందించారు. కొంత కాలం తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని శ్రీజను తన భర్తతోపాటు అత్త, మామలు, బావ, తోటి కోడళ్లు మానసికంగా, శారీరకంగా వేధించసాగారు. దీంతో 3 నెలల కిందట పుట్టించికి వెళ్లి పెద్దల సమక్షంలో అల్లుడు శ్రీనివాస్ తోపాటు కుటుంబసభ్యులతో మందలించి తిరి అత్తగారింటికి పంపించారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో.. వేధింపులు భరించలేక శ్రీజ ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో శ్రీజ తండ్రి రాములు భర్త శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.