ఆ తల నొప్పికి పరిష్కారం వెతుక్కుంటున్న బాబు

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా ప్రభావం చూపించ లేదు. తెలుగుదేశం పార్టీ కొన్ని జిల్లాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో దారుణంగా విఫలమైంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధానంగా కొన్ని తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. పార్టీలో ముందు నుంచి కూడా అనేక మంది పార్టీని ఆర్థికంగా వాడుకుంటూ కూడా చాలామంది నేతలు పార్టీ కోసం పని చేసే పరిస్థితి లేదు అని చెప్పాలి.

రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఆర్ధిక ప్రోత్సాహం కూడా చాలా అవసరం ఉంటుంది. కానీ కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీని పదవుల కోసం మాత్రమే వాడుకుంటూ అవసరమైన సందర్భంలో పార్టీ కోసం ముందుకు రాకుండా రాజకీయం చేశారు. దీని వలన సంస్థాగతంగా పార్టీ ఎంతో నష్టాన్ని చవిచూసింది అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఏంటి అంటే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళ విషయంలో…

చంద్రబాబునాయుడు కఠినంగా ముందుకు వెళ్లవచ్చు అని అంటున్నారు. త్వరలోనే ఆయన ముగ్గురు నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక నేత గుంటూరు జిల్లాకు చెందిన ఒక నేత అలాగే బందరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఒక నేతతో ఆయన త్వరలో సమావేశం కానున్నారు. పార్టీలో ఎప్పటి నుంచో పదవులు అనుభవిస్తూ మూడు నాలుగు సార్లు ఎంపీగా పనిచేసి కూడా పార్టీకి ప్రోత్సాహం అందించని వారి విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...