ఎడిట్ నోట్: మేనిఫెస్టో రచ్చ..!

-

ఏపీలో ఎన్నికల సందడి మొదలైపోయిందనే చెప్పాలి..ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు..కానీ ముందస్తు జరగవచ్చు..అలా అని షెడ్యూల్ ప్రకారం ఎన్నికలైన జరగవచ్చు..అంటే ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అనే పరిస్తితి. ఈ పరిణామాల నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఒకరినొకరు చెక్ పెట్టుకునేందుకు తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నాయి.

అయితే నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు అనేది టి‌డి‌పికి బాగా ముఖ్యం..ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే టి‌డి‌పి కథ ముగిసినట్లే. అందుకే ఈ సారి ఎలాగైనా అధికారం సంపాదించాలని చంద్రబాబు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలని ఆకర్షించేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ప్రకటించి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా మేనిఫెస్టో ప్రకటించడం అందులో మహిళలు, యువత, రైతులకు పెద్ద పీఠ వేసేలా కీలక హామీలు ఇచ్చారు. ఈ హామీలు ప్రజల్ని ఆకట్టుకుంటాయని, ఇంకా వీటితో జగన్ పని అయినట్లేనా టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి.

ఇదే సమయంలో బాబు ప్రకటించిన మేనిఫెస్టోపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. జగన్ సంక్షేమ పథకాలు అందిస్తుంటే..ఏపీ మరో శ్రీలంక అవుతుందని టి‌డి‌పి నేతలు అన్నారని, మరి ఇప్పుడు బాబు పథకాలు ఇస్తే శ్రీలంక అవ్వదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక గతంలో బాబు మేనిఫెస్టో ప్రకటించి..ఆ తర్వాత పలు హామీలని అమలు చేయకుండా మేనిఫెస్టోనే మార్చేశారని, ఇప్పుడు అయినా బాబు మేనిఫెస్టో అమలు చేస్తారని గ్యారెంటీ ఏంటి అని అంటున్నారు.

అయితే ఆదాయం సృష్టించకుండా…అప్పులు, ప్రజలపై పన్నుల భారం వేసి పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుందని, అలా కాకుండా ఆదాయం సృష్టిస్తే అదేం ఉండదని, బాబుకు ఆదాయం సృష్టించడం తెలుసని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్ని హామీల విషయంలో మాట తప్పారో ప్రజలకు తెలుసని…మద్య పాన నిషేధం, జాబ్ క్యాలెండర్, సి‌పి‌ఎస్ రద్దు, ధరలు తగ్గించడం..ఇంకా పథకాల్లో కోతలు విధించారని అంటున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య మేనిఫెస్టో విషయంలో రచ్చ నడుస్తుంది. మరి వీరిలో ప్రజలు ఎవరి మాట నమ్ముతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news