తెలంగాణా పీసీసీ అధ్యక్ష పదవి కోసం నేతలు పోటాపోటాగా లాబీయింగ్ లు చేస్తున్నారు.. సీనియార్టీ ప్రకారం తమకు ఇవ్వాలని కొందరు కోరుతుంటే.. ఎంపీ పదవి కూడా త్యాగం చేశాను.. తనను గమనించండని మరొకరు అధిష్టాన పెద్దలను కలుస్తున్నారు.. ఈ వ్యవహారం కాంగ్రెస్ పెద్దలను తలనొప్పిగా మారింది.. ముఖ్యమంత్రితో సమానమైన హోదా కల్గిన ఈ పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతునే వేళ.. ఓ చర్చ ప్రస్తుతం సీనియర్లను కలవరపెడుతోంది..
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నది.. ఈ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డులు పీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు.. ప్రస్తుతం రేవంత్ రెడ్డే అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.. ఆయన ముఖ్యమంత్రిగా ఉండటంతో ఈ పదవిని మరొకరికి ఇవ్వాలని హస్తం అధిష్టానం నిర్ణయించుకుంది.. దీంతో రేవంత్ తర్వాత ఎవరు.. అన్న చర్చ పార్టీలో జరుగుతోంది.. అషాడం అడ్డు రావడంతో కొన్నాళ్లుగా నియామకంలో జాప్యం జరుగుతోంది.. ఆశావాహుల జాబితాను సిద్దం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. దాన్ని అధిష్టానం పెద్దలకు అప్పజెప్పారు.. సీనియార్టీ కంటే సామాజికవర్గ ప్రాతిపదికను ఎంపిక ఉంటుందని పార్టీలో టాక్ వినిపిస్తోంది..
ఎస్సీల వర్గీకరణ తెలంగాణలో ప్రధానాంశంగా ఉంది. సుప్రీం కోర్టు ఇటీవల వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ఆ సామాజికవర్గానికి చెందిన నేతకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే.. పార్టీకి లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటి వరకు మహేష్ గౌడ్ పేరు ప్రచారంలో ఉండగా.. తాజగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనుహ్యంగా తెరమీదకు వచ్చింది.. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా ప్రచారంలో ఉంది.. వీరందరిలో లక్ష్మణ్ ముందు వరుసలో ఉన్నారని పార్టీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఎవరికి ఆ పదవి వరిస్తుందో..?