రాష్ట్రంలోని గిరిజన నియోజక వర్గాల్లో వైసీపీ ఏకమొత్తంగా గత ఏడాది విజయాన్ని కైవసం చేసుకుంది. అ రకు, పాడేరు, పోలవరం సహా అన్ని చోట్లా వైసీపీ దూకుడు ప్రదర్శించింది. అయితే, వీటిలో అరకు నియో జక వర్గానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇక్కడ టీడీపీకి యువ నాయకుడు ఉన్నారు. మాజీ మంత్రి కూడా అయిన ఆయనపై టీడీపీ చాలానే ఆశలు పెట్టుకుంది. అయితే, అనుకున్న రేంజ్‌లో సదరు మాజీ మం త్రి దూకుడు చూపించలేక పోతున్నారు. అరకు నుంచి 2014లో విజయం సాధించిన కిడారి సర్వేశ్వర రావును మావోయి స్టులు కాల్చి చంపిన ఘటన తెలిసిందే.
అయితే, దీనికి ముందు ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేయడం తెలిసిందే. ఇక, మరణాంతరం ఆయన కుమారుడు శ్రావణ్ కుమార్‌ను రాజకీయాల్లోకి తెచ్చిన చంద్రబాబు అనూహ్యంగా ఆయన ప్రజా ప్ర తినిధిగా విజయం సాధించకపోయినా కూడా మంత్రి పదవిని ఇచ్చారు. చట్టంలో ఉన్న లోపాలను లే దా అ వకాశాలను వినియోగించుకుని బాబు ఇచ్చిన ఛాన్స్‌ను శ్రవణ్‌కుమార్ వినియోగించుకుని ప్రజ ల్లోకి వెళ్లేలోపే.. ఎన్నికలు వచ్చాయి.
ఇక, ఎన్నికల్లో వైసీపీ ధాటికి కనీసం డిపాజిట్ కూడా దక్కించు కోలేక పోయారు. వాస్తవానికి తన తండ్రి మరణం తనకు సెంటిమెంటుగా మారుతుందని శ్రవణ్ అనుకున్నారు. అయితే, పరిస్థితి ఆయనకు అనుకూలంగా లేకపోవడంతో ఓటమి పాలయ్యారు. ఇక, తర్వాత టీడీపీకి, శ్ర వణ్‌కుమధ్య దూరం పెరుగుతూ వచ్చింది. దీనికి కారణం.. మావోయిస్టు హిట్ లిస్టులో ఉన్న కిడారి కు టుంబానికి చంద్రబాబు హయాంలో బ్లాక్ కమెండోలతో భద్రత కల్పించారు. కానీ, జగన్ అధికారంలోకి వచ్చాక నెమ్మది నెమ్మదిగా శ్రవణ్‌కు భద్రతను తగ్గించారు.
అదే సమయంలో ఆయనపై ప్రభుత్వం నిఘా కూడా పెట్టిందని శ్రవణే చెబుతున్నారు. అయితే, ఈ పరిస్థితి యువ నేతకు బాసటగా నిలిచేందుకు టీడీపీలో సీనియర్లు కానీ, పార్టీ అధినేత కానీ ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదని శ్రవణ్ అనుచరులు పేర్కొటున్నారు. దీంతో నియోజకవర్గంలో శ్రవణ్ కూడా యాక్టివ్ రోల్ పోషించడం మానేశారు. మరోపక్క, వైసీపీ నాయకులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో కీలకమైన అరకు నియోజకవర్గంలో టీడీపీ ఇక, చతికిలపడినట్టేనా అనే విమర్శలు వస్తున్నాయి. మరి బాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.