జగన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం..2,156 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు

-

జగన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. SPO లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్‌. సరిహద్దుల్లో మద్యం, గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు ఎస్పీఓ లు విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఎస్పీవోలను తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారు ఈనెల 31 వరకు విధుల్లో కొనసాగుతారని.., ఏప్రిల్ 1 నుంచి ఎస్పీవోలను తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,156 మంది ఉద్యోగస్తులు ఎస్పీవోలుగా పనిచేస్తున్నారు. కర్నూలు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరులతోపాటు ఇతర జిల్లాల్లో ఉన్న సరిహద్దుల్లో పని చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం, ఇసుక, గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు 2020 ఫిబ్రవరిలో తాత్కలిక పద్ధతిలో వీరిని నియమించారు. అయితే గత కొన్ని నెలలుగా తమకు వేతనం ఇవ్వటం లేదని సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరిని తొలగించటం చర్చనీయాంశంగా మారింది. ఇక తమ ఉద్యోగాలను ప్రభుత్వం తొలగించడంపై.. ఎస్పీఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news