జడలో పూలెట్టి..లెహంగాలో నడుము చూపి పూజా హెగ్డే హొయలు..

-

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రజెంట్ ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్ టు బాలీవుడ్ వయా కోలీవుడ్ అన్నట్లు ఆమె ప్రయాణం వెరీ బిజీ షెడ్యూల్స్ తో సాగుతోంది. ఓ వైపున తెలుగు చిత్రాల్లో నటిస్తూనే ఇతర భాషల్లో సత్తా చాటుతోంది ఈ భామ. ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ను షేర్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. లక్మె ఫ్యాషన్ వీక్ స్ప్రింగ్ సమ్మర్ అనే క్యాప్షన్ తో షేర్ చేసిన ఫొటోల్లో పూజా హెగ్డే చాలా అందంగా కనబడుతోంది. కొప్పున పూలెట్టుకుని అలా లెహంగాలో హొయలు పోయింది ఈ భామ. కళ్లద్దాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఆ డ్రెస్ లో పూజ నాజూకు నడుము చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ భామ ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈమె నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. ఇటీవల ‘రాధే శ్యామ్ ’ రిలీజవగా, త్వరలో ‘బీస్ట్, ఆచార్య’ విడుదల కానున్నాయి. ‘ఎస్ఎస్ఎంబీ 28’ లోనూ కథానాయిక పూజనే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆస్థాన హీరోయిన్ గా పూజా హెగ్డే సెటిలయిపోయిందని చెప్పొచ్చు. బాలీవుడ్ ఫిల్మ్ ‘సర్కస్ ’లోనూ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సుందరి.

https://www.instagram.com/p/CbsUSHOvsCT/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news