రేషన్ బియ్యం ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై సివిల్ సప్లై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. సోమవారం కారుమూరి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సమయంలో కోటి 46 లక్షల కార్డులు ఉంటే.. కేంద్రం 89 లక్షలకు మాత్రమే బియ్యం ఇచ్చిందని అన్నారు. కేంద్రం ఇచ్చే 89 లక్షల కార్డులకి బియ్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 9 వెనుకబడిన జిల్లాలు ఎస్సీ, ఎస్టీలు అందరికీ ఉచిత రేషన్ పథకాన్ని అమలు చేస్తామన్నారు.
ప్రతినెలా ఇచ్చే రేషన్ కి అదనంగా కేంద్రం ఇచ్చే కార్డుల బియ్యం పంపిణీ చేస్తామన్నారు. రేషన్ షాపులను మోసేస్తామన్నది పచ్చి అబద్ధమని అన్నారు మంత్రి కారుమూరి. కొన్ని పత్రికలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు తొలగించ లేదని తెలిపారు. కొత్తగా ఏడు లక్షల కార్డులు మంజూరు చేసుకున్నామని, ప్రతినెలా ఇచ్చే రేషన్ కి అదనంగా కేంద్రం ఇచ్చే రేషన్ ఇస్తామని తెలియజేశారు.