తమ్ముళ్ళ కుమ్ములాట..ఆ కమిటీతో నో యూజ్?

-

ఏపీలో అధికార వైసీపీలోనే కాదు…ప్రతిపక్ష టీడీపీలో కూడా అంతర్గత విభేదాలు ఎక్కువగానే నడుస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీలో అంతర్గత విభేదాలు ఎక్కువగా మీడియాలో హైలైట్ అవుతున్నాయి…కానీ టీడీపీలో హైలైట్ కావడం లేదు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య రగడ నడుస్తుందని తెలుస్తోంది.

అయితే నేతల మధ్య ఉన్న విభేదాలకు చెక్ పెట్టి పార్టీని గాడిలో పెట్టడానికి చంద్రబాబు…యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించారు. ఇక ఈ కమిటీ పని ఒకటి విభేదాలు ఉన్న నియోజకవర్గాలకు వెళ్ళడం..అక్కడ నేతలతో మాట్లాడటం…సమస్యలు రాకుండా చూసుకోవడం…అందరూ కలిసికట్టుగా పనిచేసుకునేలా ఆదేశించడం చేయడం.

ఇలా యనమల కమిటీ…పలు నియోజకవర్గాల్లో ఉన్న అంతర్గత పోరుకు చెక్ పీట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ అనుకున్న స్థాయిలో పార్టీలోని విభేదాలు చక్కదిద్దడంలో యనమల కమిటీ ఫెయిల్ అవుతున్నట్లే కనిపిస్తోంది. ఈ మధ్య గుడివాడలో తెలుగు తమ్ముళ్ళ మధ్య ఫ్లెక్సీల విషయంలో రగడ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో గుడివాడ నేతలని పిలిచి యనమల కమిటీ క్లాస్ తీసుకుంది..అలాగే అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కానీ గుడివాడలో నేతల మధ్య విభేదాలు సద్దుమనగలేదు. అటు పుంగనూరులో కూడా నేతల మధ్య పోరు తగ్గించడానికి చూశారు గాని..పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. శింగనమల, కళ్యాణదుర్గం, దర్శి లాంటి స్థానాల్లో విభేదాలు చక్కదిద్దలేదు. పార్టీలో కేశినేని నాని వ్యవహారంపై సంప్రదింపులు లేవు. మొత్తానికి విభేదాలు చక్కదిద్దడంలో యనమల కమిటీ ఫెయిల్ అవుతుంది…ఇక చంద్రబాబు డైరక్ట్ గా దిగాల్సిన పరిస్తితి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news