ఏపీ అప్పులపై వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం అప్పు 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి 1.53 లక్షల కోట్లు ఉందని వెల్లడించారు జగన్. 2019లో చంద్రబాబు దిగే సమయానికి 4.08 లక్షల కోట్లకు చేరిందని క్లారిటీ ఇచ్చారు. ఇక 7.48 వేల కోట్లు అప్పు… వైసీపీ అధికారం దిగిపోయే సమయానికి ఉందని స్పష్టం చేశారు. అంటే ప్రస్తుత ఏపీ అప్పులు 7.48 వేల కోట్లు అన్నట్లు.
వైసీపీ హయంలో 12.90 శాతం అప్పులు చేశామని… ఇలా తప్పుడు లెక్కలు అసత్యాలు చెప్పటం ధర్మమేనా ? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జగన్. కొవిడ్ సమయం ఎదుర్కొన్నా కూడా చంద్రబాబు కంటే తక్కువగా అప్పులు చేశామన్నారు జగన్. ఎన్నికల హామీలు అమలు చేయకుండా తప్పించు కోవడానికి ఇదంతా చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ కు కూడా అప్పులు అంశంపై లెటర్ రాస్తున్నాను అని…. వాస్తవాలు తెలుసుకోకుండా అసెంబ్లీలో మాట్లాడటం ధర్మమే నా అని లెటర్ రాస్తున్నానని తెలిపారు. వాస్తవాలకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ గవర్నర్ కు పంపుతామని ప్రకటించారు.