జమిలీ ఎన్నికలపై జగన్ హాట్ కామెంట్స్ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ఓ మీడియా ప్రతినిధి జమిలీ ఎన్నికల గురించి ప్రశ్నించగా.. జమిలి ఎన్నికల నిర్వహణ ఎవరి చేతుల్లో లేదు. జమిలి ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉండటమే మన చేతుల్లో ఉంది. అందుకు ప్రిపేర్ గా ఉండాలని పార్టీ శ్రేణులకు చెప్పాం. ఈవీఎం లపై మా ఫైట్ కొనసాగుతోంది. ఒంగోలులో ఈవీఎం లపై హైకోర్టులో పిటిషన్ వేశాం.
ఈసీ వీవీ ప్యాట్లు, evm లలో ఓట్లు మ్యాచ్ చేయవచ్చు కదా అన్నారు జగన్. ఇలా చేస్తే దేశంలో ఉన్న అందరి డౌట్లు పోతాయి కదా. మా ముందు వెరిఫై చేయాలని కోరాం. ఈసీ కి ఏ కల్మషం లేకపోతే వెరిఫై చేయవచ్చు కదా అన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు తిరగబడతారు. ప్రజలు తిరగబడితే చంద్రబాబు ఆయన పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదు అన్నారు జగన్.