ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో వివాదస్పద నిర్ణయం తీసుకున్నాడు. ఏపీ పదో తరగతి తెలుగు పుస్తకం నుంచి అమరావతి సిలబస్ ను తొలగించింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా.. ప్రారంభమైందని.. కాబట్టి విద్యార్థులపై భారం పడకూడదన్న ఉద్దేశంతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖాదికారులు స్పష్టం చేశారు.
దీంతో పాటు.. వివిధ సబ్జెక్టుల్లోని.. మరికొన్ని పాఠాలను కూడా తొలగించినట్లు పేర్కొన్నారు. సిలబస్ నుంచి అమరావతి సిలబస్ ను తొలగించడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులపై భారం పడకూడదనుకుంటే పుస్తకం చివర లోని పాఠాలను తొలగిస్తారు కానీ.. రెండో పాఠంగా ఉన్న అమరావతిని ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు విపక్ష నాయకులు. నేటి నుంచి పదో విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో.. అమరావతి, వెన్నెల పాఠాలు తప్ప మిగిలిన పాఠలు చదువుకుని సిద్ధం కావాలని ఇప్పటికే టీచర్లు సూచనలు చేశారు.