ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్..11వ తేదీన మహాధర్నా !

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వాల మధ్య వైరం చిలికి..చిలికి గాలి వానలా తయారైంది. రెండు ప్రభుత్వాలు ఎక్కడా తగ్గేదేలా అన్నట్లుగానే.. ధాన్యం కొనుగోలు అంశంపై వ్యవహరిస్తున్నాయి. ఇవాళ్టి నుంచి తెలంగాణ వ్యాప్తంగా.. టీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నాలకు పిలుపు ఇవ్వగా..నిన్న రాత్రి సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి చేరుకున్నారు.

నిన్న రాత్రి 7 గంటల సమయంలో.. ఢిల్లీకి వెళ్లారు సీఎం కేసీఆర్‌. దాదాపు వారం రోజుల పాటు సీఎం కేసీఆర్‌.. ఢిల్లీలోనే ఉండనున్నారని సమాచారం అందుతోంది. అంతేకాదు.. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద.. సీఎం కేసీఆర్‌ ధర్నాకు కూర్చూనే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ మహా ధర్నాను ఈ నెల 11వ తేదీన చేసే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీని కలిసినా.. ధాన్యం కోనుగోలు అంశంపై.. కేంద్రం మొండిగా వ్యవహరించడంతో… స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగాలని అనుకుంటున్నారని సమాచారం. ఢిల్లీలో ధర్నా చేస్తే..రైతుల సమస్య దేశ్య వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారనుంది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ నిన్న ఢిల్లీ కి వెళ్లారు.

 

Read more RELATED
Recommended to you

Latest news