చంద్రబాబు, కరువు ఇద్దరూ కవల పిల్లలు అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇవాళ సీఎం వైయస్ జగన్ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. నిధులను విడుదల చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. దళారీలు లేకుండా డబ్బులు మీ అకౌంట్లో పడుతున్నాయి. చంద్రబాబును సీఎంని చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకన్నా అప్పుల వృద్ధిరేటు తక్కువే. చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలు లేవన్నారు సీఎం జగన్. వరుసగా నాలుగో ఏడాది రైతు భరోసా.. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేవారు ఎక్కువయ్యారు. దేవుడి దయతో మంచి నిలబడాలి..అన్ని ప్రాంతాలకు మంచి రోజులు రావాలని కోరారు సీఎం జగన్.