జగన్ నన్ను తరిమేసే పరిస్థితి ఏనాటికి రాదు – అనిల్ కుమార్ యాదవ్

-

నెల్లూరు జిల్లా: సోషల్ మీడియాలోని ఓ వార్తా సంస్థ పేరుతో వచ్చిన అసత్య వార్తపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్. ఎవరో కొంతమంది ఫేక్ గాళ్ళు.. ఫేక్ వార్తలతో అసత్య ప్రచారాలకు దిగినంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నారు. తన పేరును వాడుకొని మీరు డబ్బులు సంపాదించుకుంటూ.. సుఖంగా ఉంటారంటే దాన్ని కూడా స్వాగతించే వ్యక్తిని తానంటూ చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ “మా తండ్రి వర్ధంతి నాడు మా తండ్రి సాక్షిగా చెప్తున్నా.. రాజకీయాలలో ఉన్నంతవరకు జగనన్న తోనే నా పయనం. జగన్మోహన్ రెడ్డి నన్ను తరిమేసే పరిస్థితి ఏనాటికి రాదు. ఒకవేళ వచ్చినా.. తుది శ్వాస వరకు జగనన్న కోసమే పని చేస్తా. పేరుపొందిన గొర్రెలతో కలిసి గొర్రెగా ఉండే కంటే.. ఒంటరిగా సింహంలా ఉండడం మంచిది అనే సామెతను బాగా విశ్వసిస్తా. మోకాలి సమస్య కారణంగా చికిత్స కోసం 15 రోజులపాటు నగరానికి దూరంగా ఉండబోతున్నాను.

మీడియా దానిని వక్రీకరించి అనిల్… జగన్ కు దూరం అవుతున్నాడు.. అనిల్ పని అయిపోయింది, అందుకే కనిపించడం లేదు అంటూ తప్పుడు వార్తలు పెట్టకండి. 15 రోజులలో చికిత్స పూర్తయిన అనంతరం జరిగే సమావేశాలలో ఆ చికిత్సకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించేందుకు కూడా నేను సిద్ధమే. అన్ని విషయాల్లో కోపం.. ఆవేశం ప్రదర్శించినా..ఒక్క జగన్ విషయంలో మాత్రం ఓపికగా ఉంటా. గెటవుట్, గెట్ లాస్ట్ అని జగన్ నాతో అన్నా.. నేను మాత్రం ఫాలోయర్ గానే ఉంటా” అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news