విశాఖ: టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు పెందుర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు. చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరని అన్నారు. అబద్దాలకు అంబాసిడర్ చంద్రబాబు అని.. 600 హామీలు ఇచ్చి అమలు చేయని ఘనత చంద్రబాబుదేనన్నారు. 2014 నుంచి 2019 వరకు ఒక ఇళ్ల పట్టయినా ఇచ్చారా..? అని ప్రశ్నించారు అదీప్ రాజు.
ఎన్టీఆర్ సంక్షేమ కార్యక్రమాలను పెడితే వాటిని తీసివేసిన ఘనత చంద్రబాబుదన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో సుమారు 2600 కోట్లు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని తెలిపారు. పంచగ్రామల భూ సమస్యకు మూల పురుషుడు చంద్రబాబు నాయుడని దుయ్యబట్టారు. మాజీ మంత్రి బండారు నోరు అదుపు పెట్టుకోవాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.