విద్యా వైద్య రంగాలను ప్రజలకు చేరువ చేసినప్పుడే నిజమైన అభివృద్ధి అని మేధావులు అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో విద్య వైద్యం రెండు కార్పొరేట్ సంస్థలకే పరిమితమయ్యాయి అనేది జగమెరిగిన సత్యం. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా వైద్యాన్ని అందిస్తోంది. ఉచిత వైద్యం అంటే ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవడం అనుకుంటే మీరు పొరపడినట్లే.
వైసిపి ప్రభుత్వం ఇంటి ముందుకు ఆరోగ్య సిబ్బందిని పంపించి వారి ఆరోగ్య సమస్యలను గుర్తించి అందుకు కావలసిన పరీక్షలను కూడా తక్షణమే చేయించి అవసరమైన మందులను ఇవ్వడం,అంతే కాకుండా మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు పంపించటం ఇదండీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్యం.
జగనన్న ఆరోగ్య సురక్ష అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక మహత్కార్యానికి నాంది పలికారు అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 30న ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పటికీ కోట్లాదిమందికి సేవలందిస్తూ దిగ్విజంగా కొనసాగుతుంది. గడపగడపకు ప్రభుత్వం అంటే ఏమి చేశారని గడప గడపకు వెళతారని ఎగతాళి చేసిన వారే,ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు,పేదవారికి వైద్యం అందిస్తున్న ఆరోగ్య సిబ్బందిని,వాలంటీర్లను చూసి శభాష్ జగన్ అంటున్నారు.
ఆరోగ్య సురక్ష క్యాంపులకు లక్షల మంది వచ్చి తమకు కావలసిన వైద్య సేవలు పొందాలంటే విమర్శకులైన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించాల్సిందే. 13 వేలకు పైగా సచివాలయాల్లో లక్షల మందికి వైద్య సేవలు, కోట్లలో ఆరోగ్య పరీక్షలతో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతం అయ్యిందంటే వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎంత చేరువ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు కదా…