జేసీ దివాకర్ రెడ్డికి భారీ షాక్.. 100 కోట్ల ఫైన్

-

ఏపీ రాజకీయాల్లో వివాదాస్పద నేతగా పేరు తెచ్చుకున్న జేసీ దివాకర్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆయన ఏకంగా 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ఆయనకు త్రిశూల్ సిమెంట్ కంపెనీ పేరిట ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ పేరిట ఆయన అక్రమ మైనింగ్ కి పాల్పడినట్లు మైనింగ్ శాఖ గుర్తించింది. అనంతపురం జిల్లాలోని యాడికి మండలం కోన ఉప్పలపాడు లో ఏకంగా 14 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్ అక్రమంగా జేసీ దివాకర్ రెడ్డి మైనింగ్ జరిపారని మైనింగ్ శాఖ గుర్తించింది.

ఈ వంద కోట్ల రూపాయల జరిమానా గనుక చెల్లించకపోతే ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆయన ఆస్తులను జప్తు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు మైనింగ్ శాఖ అధికారుల నుంచి ఆయనకి ఉత్తర్వులు అందాయి. జెసి ఇంట్లో పనిచేసే పనిమనుషులు డ్రైవర్ల పేరుతో ముందు ఈ దృశ్యాలు సిమెంట్ ఫ్యాక్టరీ కోసం అనుమతులు పొంది అనంతరం ఆ వాటాలను జేసి కుటుంబ సభ్యుల పేరిట చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news