శైలజానాథ్ ఇంటికి జేసీ దివాకర్ రెడ్డి.. టీడీపీలో చేరడం లాంచనమే!

-

అనంతలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. మాజీమంత్రి టిడిపిలోకి వస్తారంటూ సరికొత్త ప్రచారం మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీపీసీసీ చీఫ్ గా వ్యవహరించారు మాజీ మంత్రి శైలజానాథ్. ఇప్పుడు ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. గత కొద్ది రోజులుగా ఆయన టిడిపి పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వెలువడ్డాయి.

అయితే ఈరోజు సడన్ గా శైలజానాద్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. జెసి దివాకర్ రెడ్డి దాదాపు గంటన్నర పాటు శైలజానాథ్ తో చర్చలు జరిపారు. అయితే శైలజానాథ్ ఆహ్వానం మేరకే జెసి ఆయన నివాసానికి వెళ్లారని చెబుతున్నారు. ఈ భేటీ పై శైలజనాథ్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే వీరిద్దరూ తాజా రాజకీయ పరిణామాలు, శింగనమల సీటుపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు శైలజనాథ్ టిడిపిలో చేరిక దాదాపు ఖాయం అయిందంటున్నారు టిడిపి నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news