ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్ పై తీర్పు వాయిదా !

-

గత కొంతకాలంగా దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న స్కాం పేరు ఢిల్లీ లిక్కర్ స్కాం. ఇందులో ఎందరో ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు మరియు ధనవంతులు మిళితమై ఉన్నారని వార్తాపత్రికలు ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే దొరికినవాడే దొంగ అన్నట్లు ఇందులో ఇంకా దొరకకుండా తిరుగుతున్న దొరలు చాలామందే ఉన్నారు. వారిని పట్టుకోవడానికి సీఐడీ ప్రయత్నాలు సాగిస్తోంది. కాగా ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈయనను ఎలాగైనా బయటకు తీసుకురావడానికి సిసోడియా తరపున లాయర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.

బెయిల్ కోసం వేసిన పిటీషన్ పై ఈ రోజు కోర్ట్ లో వాదనలు జరిగాయి. కానీ తుది తీర్పును న్యాయమూర్తి ఈ నెల 28వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మరి చూద్దాం ఆ రోజు అయినా సిసోడియా కాయిల్ పై పాజిటివ్ గా తీర్పు వస్తుందా ?

Read more RELATED
Recommended to you

Latest news