నంద్యాల జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇసుక వివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లాకు వచ్చే ఇసుక ట్రిప్పర్లను తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. బనగానపల్లె ఇసుక స్టాక్ పాయింట్ కు కడప జిల్లా కొండాపురం పి.అనంతపురం నుంచి ట్రిప్పర్లలో ఇసుక రవాణా అవుతుంది. అయితే తాడిపత్రి మీదుగా ఇసుక ట్రిప్పర్లు రావడంతో అడ్డుకున్నారు జేసీ అనుచరులు.
దాంతో మూడు రోజులపాటు బనగానపల్లె ఇసుక స్టాక్ పాయింట్ కు ఇసుక రవాణా నిలిచిపోయింది. ఇక ఇసుక అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు బనగానపల్లె సమీప ప్రాంతాల ప్రజలు. ఈ విషయం మంత్రి జనార్దన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో అక్కడి జిల్లా అధికారులతో మాట్లాడి అసంతృప్తి వ్యక్తం చేసారు మంత్రి. ఇసుక ట్రిప్పర్లను అడ్డుకుంటే బాగుండదని అధికారులకు స్పష్టం చేసారు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి. మంత్రి హెచ్చరికతో అధికారుల జోక్యంతో ప్రస్తతం ఇసుక రవాణా ఎటువంటి అడ్డు లేకుండా కొనసాగుతుంది.