రేపే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం..!

-

ఎన్నోరోజులుగా వాయిదాలు పడుతూ ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. బెజవాడ వాసులకు ఇది చిరకాల కోరిక అని చెప్పచు. ఇన్నాళ్లకి వాళ్ళ కోరిక నెరవేరబోతుంది. కనకదుర్గ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు అంతా పూర్తయ్యి చాలా రోజులు అవుతుంది.. కానీ ప్రారంభోత్సవానికి మాత్రం అనేక అడ్డంకులు ఒకటి తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇది వరకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీ మృతితో ఒక్కసారి వాయిదా పడితే.. తరువాత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ రావటం వల్లన రెండోసారి వాయిదా పడింది.

ఇన్ని అవాంతరాలు ఎదురుకున్నాక, ఎట్టకేలకు ఈ సారి ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11.30 గంటలకు కనకదుర్గ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభం కాబోతుంది . ప్రస్తుత పరిస్థితుల కారణంగా వర్చువల్‌ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్మోహన్ ‌రెడ్డి పాల్గొననున్నారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లన్నీ కలెక్టర్ ఇంతియాజ్ చూసుకున్నారు. ఫ్లైఓవర్ ప్రారంభం చేసాక మొదటిగా ఆర్ అండ్ బీ మంత్రి శంకర్ నారాయణ ఇంకా కొంతమంది అధికారులు కలిసి ట్రావెల్ చేయనున్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 61 కొత్త ప్రాజెక్టులు ప్రారంభోత్సవం, శంకుస్థాపన జరగనున్నాయి. రూ.15,592 కోట్ల రూపాయలు అంచనాలతో మొత్తం 61 ప్రాజెక్టులను అధికారులు ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news